News February 28, 2025
ముమ్మిడివరం: రోడ్డు ప్రమాదం.. యువకుల వివరాలు ఇవే..

ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ముమ్మిడివరం మండలం బూరుగుపేటకు చెందిన మట్ట ఆకాశ్రెడ్డి (21), ముమ్మిడివరానికి చెందిన అభి(19) అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం రాత్రి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి యానం వెళ్లి వస్తుండగా ఆగి ఉన్న లారీని కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 9, 2025
వరంగల్లో ఉద్యోగులకు ఏసీబీ వణుకు

ఉమ్మడి వరంగల్లో ACB దాడులు పెరిగాయి. గతేడాది 16 కేసులు నమోదవగా ఈ ఏడాది ఇప్పటి వరకు 19 కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ తిమింగళం, తొర్రూర్ CI, పెద్ద వంగర తహశీల్దార్, తాజాగా HNK అడిషనల్ కలెక్టర్ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. DSP సాంబయ్య నేతృత్వంలో విద్యాశాఖలో 3, పోలీసు2, రవాణా2, రిజిస్ట్రేషన్2, రెవెన్యూ3, రోడ్లు1, వ్యవసాయం1, ట్రాన్స్ కో1, భగీరత1, పంచాయతీ రాజ్2, మత్స్యశాఖలో ఒకరు ACBకి చిక్కారు.
News December 9, 2025
USలో లోకేశ్ పర్యటన.. కీలక భేటీలు

AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్తో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. అలాగే ఓమిమం సంస్థ చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగం కరుప్పయ్యతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
News December 9, 2025
భారత్ బియ్యంపైనా టారిఫ్లకు సిద్ధమైన ట్రంప్

ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న బియ్యంపై కొత్త టారిఫ్లు విధించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భారత్ బియ్యం తక్కువ ధరలకు వస్తున్నాయని, ఇది అమెరికన్ రైతులకు నష్టం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్తో పాటు కెనడా నుంచి వచ్చే ఎరువులపై కూడా కఠిన టారిఫ్లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే భారత వస్తువులపై US 50% <<18423577>>సుంకాల<<>>ను విధించింది.


