News March 8, 2025

ముమ్మిడివరం: వివాహితపై కత్తితో దాడి

image

ముమ్మిడివరం మండలం అనాతవరం ఎదురుమూడి పుంతకు చెందిన మాలతిపై అదే ప్రాంతానికి చెందిన జయరామకృష్ణ శనివారం కత్తితో దాడి చేశాడు. మాలతి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో చుట్టుపక్కల పిల్లలు అల్లరి చేస్తుండగా ఆమె వారిని మందలించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న జయరామకృష్ణ కోపంతో కత్తితో మాలతిపై దాడి చేశాడు. ఆమె అపస్మారక స్థితికి చేరడంతో అమలాపురం ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఎస్ఐ జ్వాలా సాగర్ కేసు నమోదు చేశారు.

Similar News

News January 16, 2026

YTలో పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రించవచ్చు!

image

పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రించేందుకు యూట్యూబ్ ‘పేరెంటల్ కంట్రోల్స్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పిల్లలు యూట్యూబ్ వీడియోలు చూడకుండా పూర్తిగా బ్లాక్ చేయడం లేదా టైమ్ ఫిక్స్ చేయడం వంటివి చేయవచ్చు. ఈ వీడియోలకు పిల్లలు బానిసలుగా మారుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో యూట్యూబ్ ఈ మార్పులు తీసుకొచ్చింది. దీంతోపాటు కిడ్స్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేలా సైన్-అప్ ప్రక్రియను ఈజీ చేసింది.

News January 16, 2026

జగిత్యాల: వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై అవగాహన

image

తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై జగిత్యాల జిల్లా స్థాయి అవగాహన సదస్సు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది నిరుపేద వృద్ధులకు వస్త్రాలు, దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేసి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 36మందిని మెమెంటోలు, శాలువాలతో ఘనంగా సన్మానించినట్లు జిల్లా అధ్యక్షుడు హరి కిషోర్ కుమార్ తెలిపారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం పనిచేస్తామన్నారు.

News January 16, 2026

తిరుగు ప్రయాణం.. తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ నరసింహ

image

సంక్రాంతి ముగియడంతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రద్దీ దృష్ట్యా డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. రోడ్డు పనుల వద్ద ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామని, పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని కోరారు. నిద్రమత్తులో వాహనాలు నడపరాదని, అత్యవసరమైతే డయల్ 100కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు.