News August 11, 2024

ముమ్మిడివరం MLA బుచ్చిబాబు సోదరుడు మృతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం MLA దాట్ల బుచ్చిబాబు సోదరుడు వెంకట సీతారామరాజు(43) శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో స్వగ్రామం ఐ.పోలవరం మండలం మురమళ్లలో విషాదం నెలకొంది. సీతారామరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. సోదర వియోగంతో బాధపడుతున్న MLA బుచ్చిబాబును పలువురు పరామర్శించి ఓదార్చారు. నియోజకవర్గంలోని నాయకులు, MLA అభిమానులు సీతారామరాజు మృతి పట్ల సంతాపం తెలిపారు.

Similar News

News September 20, 2024

రాజోలులో 54 కిలోల లడ్డూ వేలం

image

రాజోలు మండలం కూనవరం గ్రామంలో గురువారం రాత్రి 54 కిలోల వినాయకుడి లడ్డూ వేలం వేశారు. ఇందులో భక్తులు పోటాపోటీగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా ఆ లడ్డూను స్థానిక భక్తుడు పిల్లి రామకృష్ణ రూ.73 వేలకు దక్కించుకున్నారు. ఈ లడ్డూను ఊరేగింపుగా తీసుకు వెళ్లి భక్తులకు ప్రసాదంగా పంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

News September 20, 2024

గోకవరం: గంజాయి రవాణా చేస్తున్న బాలికలు అరెస్ట్

image

గోకవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు బాలికలను అరెస్ట్ చేసినట్లు ఎస్సై విఎన్వీ పవన్ కమార్ తెలిపారు. వారిది ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరిగా గుర్తించి, వారివద్ద నుంచి సుమారు 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న బాలికలను జువనైల్ హోంకు తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు. స్వాధీన పరుచుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,53,400 ఉంటుందన్నారు.

News September 19, 2024

చిరుతను పట్టుకునేందుకు 100 ట్రాప్ కెమెరాలు: భరణి

image

చిరుత పులిని పట్టుకునేందుకు 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తూ.గో. జిల్లా అటవీ శాఖ అధికారి భరణి గురువారం తెలిపారు. గత రాత్రి శ్రీరాంపురం, పాలమూరు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్లు వచ్చిన సమాచారం అవాస్తవమన్నారు. నిపుణుల బృందం పాదముద్రలు పరిశీలించగా అవి అడవి పిల్లి పాద ముద్రలుగా నిర్ధారణ జరిగిందన్నారు. ట్రాప్ కెమెరాలో అడవి పిల్లిని గుర్తించడం జరిగిందని తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు.