News August 12, 2024
మురారి మూవీ చూస్తుండగా గొడవ.. హత్యాయత్నం
థియేటర్‌లో జరిగిన చిన్న గొడవ హత్యాయత్నం వరకు వెళ్లింది. భీమవరంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మురారి రీ-రిలీజ్ సందర్భంగా ఓ థియేటర్‌లో సినిమా చూస్తుండగా హర్షప్రవీణ్- రాహుల్ మధ్య గొడవ జరిగింది. దాన్ని మనుసులో పెట్టుకొని అదే రోజు సాయంత్రం హర్షను రాహుల్ చాక్‌తో పొడిచి పారిపోయాడు. సహచరులు అతడిని ఆసుపత్రికి తరలించగా.. హర్ష ఫిర్యాదు మేరకు కేసు నమోదు SI వీర్రాజు తెలిపారు.
Similar News
News September 9, 2024
ఏలూరు జిల్లాలో రేపు కొన్ని స్కూళ్లకు సెలవు
ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా మంగళవారం కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారి అబ్రహం సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. భీమడోలులో 1, పెదపాడులో 7, మండవల్లిలో 18, కైకలూరులో 9, ఏలూరులో 1, ముదినేపల్లిలో 3, కలిదిండిలో 5 స్కూళ్లకు సెలవు ఉంటుందన్నారు. మిగతా పాఠశాలలు యధావిధిగా నడపవచ్చని సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
News September 9, 2024
ఏలూరు: ATMల వద్ద చీటింగ్.. వ్యక్తి అరెస్ట్
ఏలూరు జిల్లా కైకలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చదువు రాని వారిని, వృద్ధులను ATM కేంద్రాల వద్ద దృష్టి మళ్లించి డబ్బు కాజేస్తున్న వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. పల్లా సురేంద్ర కుమార్ చెడు వ్యసనాలకు బానిసై ATM ల వద్ద చీటింగ్, దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 2019 నుంచి ఇలా మోసాలు చేస్తున్నాడని, ఫిర్యాదులు రాగా కేసు దర్యాప్తు చేసి సురేంద్రను అరెస్టు చేశామని తెలిపారు.
News September 9, 2024
ప.గో: కోతుల దాడిలో 50 మందికి గాయాలు
ప.గో జిల్లా పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రులో కోతులు దడ పుట్టిస్తున్నాయి. గుంపులుగా ఇళ్లపై తిరుగుతూ దాడి చేస్తున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. వారం రోజులుగా గ్రామంలో ఇదే సమస్య ఉందని, సుమారు 50 మందికి పైగా గాయాల పాలయ్యారని తెలిపారు. వీరంతా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చేరుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడా కోరుతున్నారు.