News February 27, 2025
ములకలచెరువులో పోక్సో కేసు నమోదు

ములకలచెరువు పోలీసులు మైనర్ బాలికను ఆటోలో తీసుకెళ్లి అదృశ్యం చేసిన నిందితుడిపై పోలీసులు పోక్సోకేసు నమోదు చేశారు. ములకలచెరువు మండలం బురకాయల కోటకు చెందిన ఆటో డ్రైవర్ కొలిమి శ్రీకాంత్(27) బురకాయలకోట-ములకలచెరువుకు ఆటో నడుపుకునే వాడు. ఈ క్రమంలో ఓ గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని తీసుకెళ్లిపోయాడు. ఈ మేరకు విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పొక్సో కేసు నమోదైంది.
Similar News
News March 21, 2025
తులసి మెుక్క ఇంట్లో ఉంటే కలిగే లాభాలివే..!

హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మెుక్కను లక్ష్మీదేవీ స్వరూపంగా భావిస్తారు. దోమలు, కీటకాలు వంటివి ఇంట్లోకి రాకుండా రక్షణ కల్పిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఉంటే పాజిటివ్ ఎనర్జీ. తులసి ఆకుల్ని నమిలితే జలుబు, దగ్గు వంటి వ్యాధులకు ఉపశమనం లభించడంతో పాటు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి, తద్వారా మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. వీటి వాసన పీల్చుకుంటే ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది.
News March 21, 2025
శివంపేట: హత్యాయత్నం కేసులో ముగ్గురు అరెస్ట్

బోరు విషయంలో ఒక కుటుంబంపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు.. తిమ్మాపూర్ గ్రామంలో గత రాత్రి బాలయ్య కుమారులు ప్రసాద్, రాజు అనే వ్యక్తులు దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
News March 21, 2025
దంపతుల హత్య కేసులో పలువురికి శిక్ష:SP

దంపతుల దారుణ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించినట్లు వికారాబాద్ SP నారాయణరెడ్డి తెలిపారు. ధారూర్ PS పరిధిలోని నాగసముందర్ కు చెందిన చిన్న నర్సింహులు, అంజమ్మలను అదే గ్రామానికి చెందిన బంధప్పతో పాటుగా ఆరుగురుతో కలిసి దాడి చేసి చంపారు. ఈ కేసులో పలువురికి జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు.