News February 12, 2025

ములకలచెరువు: రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం మృతి

image

రోడ్డుప్రమాదం ఓ కుటుంబం మొత్తాన్ని కబళించింది. ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె ప్రశాంతనగర్‌కు చెందిన భార్యాభర్తలు, పిల్లలు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తప్పు ఎవరిదైనా ప్రమాదంలో నాలుగు ప్రాణాలు పోవడం తీరని విషాదం. ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. డ్రైవింగ్ చేసే ముందు మనకూ ఒక కుటుంబం ఉందని గుర్తించండి.

Similar News

News December 5, 2025

ఆదోని జిల్లా డిమాండ్‌.. టీడీపీ నేతలపై సీఎం అసంతృప్తి

image

కర్నూలు జిల్లా నేతల తీరుపై CM చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండును ముందుగా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల ముందు ఆదోని జిల్లా డిమాండ్‌ లేదని తిక్కారెడ్డి వివరించినట్లు సమాచారం. దీనిపై జిల్లా నేతలంతా చర్చించుకుని తన వద్దకు రావాలని సీఎం సూచించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

News December 5, 2025

గద్వాల్: పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరం

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులకు పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం గద్వాలలోని ప్రభుత్వ అభ్యసన, బాలికల ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న రెండో దశ శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

News December 5, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ/కెమికల్ /కంప్యూటేషనల్ & ఇన్‌ఫర్మేషన్ /ఫార్మాస్యూటికల్/వెటర్నరీ విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nii.res.in