News June 29, 2024
ములకలపల్లిలో బైక్ సీటు కింద నుండి పాము
ములకలపల్లిలో బైక్ సీటు కిందకు పాము దూరింది. శనివారం సాయంత్రం మండల కేంద్రంలో రోడ్డు పక్కన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. పని ముగించుకొని బైక్ వద్దకు వస్తుండగా సీటు కింది నుంచి మెల్లగా పాము బయటకు రావడం గమనించాడు. స్థానికులు వచ్చి దానిని వానకోయిల(విషరహితం)గా గుర్తించారు. తర్వాత పాము కిందకు దిగి రోడ్డు పక్కకు వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News October 12, 2024
KMM: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
దసరా SPECIAL.. ఖమ్మంలో తమిళ దేవత..!
తమిళుల ఆరాధ్య దైవం మారియమ్మన్.. ఏళ్లుగా ఖమ్మం ప్రజల ఇలవేల్పుగా మారింది. ఇక్కడ మారెమ్మగా పూజలందుకుంటోంది. ఖమ్మంలో గ్రానైట్ పరిశ్రమ ఉండడంతో 1970లో తమిళనాడు నుంచి భారీగా కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేసేవారు. కాగా 1982లో పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతుండడంతో తమను కాపాడాలని కోరుతూ వారు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2018లో ఈ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది.
News October 12, 2024
మణుగూరు – బెలగావి రైలు పునరుద్ధరణ
ఈనెల 16వతేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు మణుగూరు – బెలగావి రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలును దాదాపు 5 నెలల 15 రోజులు మాత్రమే తాత్కాలికంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఈ రైలును మణుగూరు నుంచి బెలగావి వరకు శాశ్వతంగా నడపాలని, అలాగే డోర్నకల్ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్డు మధ్యలో గల అన్ని స్టేషన్లలో ఆపాలని ప్రజలు కోరుతున్నారు.