News April 12, 2025
ములుగులో నేడు మంత్రి సీతక్క పర్యటన

ములుగు మండలంలో శనివారం మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్ కుమార్ ప్రకటనలో తెలిపారు. మండలంలోని జంగాలపల్లి, కాసిందేవిపేట, పెగడపల్లి, కొత్తూరు, సర్వాపురం, రాయినిగూడెం, కన్నాయి గూడెం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.
Similar News
News December 1, 2025
PDPL: ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూడాలి: కలెక్టర్

పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ర్యాండమైజెషన్‌ను పరిశీలించిన ఆయన, సిబ్బంది కేటాయింపు నిబంధనల ప్రకారం ఉండాలని తెలిపారు. నామినేషన్లు టి–యాప్‌లో నమోదు చేయాలని, అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులు సమయానికి అందించాలని సూచించారు.
News December 1, 2025
చలికాలం స్వెటరు వేసుకుని పడుకుంటున్నారా?

చలికాలం కొందరు స్వెటరు వేసుకుని పడుకుంటారు. అయితే దానికి బదులు కాటన్, లెనిన్, బ్రీతబుల్ దుస్తులు మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ‘స్వెటరే వేసుకోవాలి అనుకుంటే టైట్‌గా ఉండేది వద్దు. దాంతో బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా జరగదు. కాస్త లూజ్‌గా, పొడిగా, బ్రీతబుల్, శుభ్రంగా ఉండేది వేసుకోండి. వింటర్లో కాళ్లకు సాక్సులు వేసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అవి కూడా శుభ్రంగా, కాస్త లూజ్‌గా ఉండాలి’ అని చెబుతున్నారు.
News December 1, 2025
పెద్దపల్లి: ఎల్లమ్మ గూడెం ఘటనను ఖండించిన యాదవులు

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెంలో యాదవ కుటుంబంపై మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు ప్రవర్తించిన తీరును యాదవ యువజన సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండిరచారు. ఈ రోజు పెద్దపల్లిలోని యాదవ భవన్లో వారు మాట్లాడారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు యాదవ సంఘం నాయకులున్నారు.


