News March 6, 2025

ములుగులో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష

image

ములుగు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వార్షిక పరీక్షల ఏర్పాట్లపై విద్యా, రెవెన్యూ, పోలీస్, వైద్య, పోస్టల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పరీక్షలు జరుగుతాయన్నారు. 21 సెంటర్లలో మొత్తం 3,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

Similar News

News February 9, 2026

JNG: ప్రయోగ పరీక్షలు 996 మంది విద్యార్థులు హాజరు

image

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగ పరీక్షలు 8వ రోజు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ కే. జితేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 7 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం జనరల్ 298 మందికి 298 మంది, ఒకేషనల్ 307 మందికి 268 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జనరల్ 255 మందికి 252 మంది, ఒకేషనల్ 197 మందికి 178 మంది హాజరయ్యారు.

News February 9, 2026

PDPL: 48 గంటల సైలెన్స్ పీరియడ్: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగింపు ముందు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష తెలిపారు. FEB 9 సాయంత్రం 5 గంటల నుంచి FEB 11 పోలింగ్ ముగిసే వరకు PDPL, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రచారం, రాజకీయ ప్రసంగాలు, ఫలితాలను ప్రభావితం చేసే వార్తల ప్రచారం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 9, 2026

జనగామ: ‘ఈనెల 11న సాధారణ సెలవు’

image

ఈనెల 11న జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ సంస్థలకు సాధారణ సెలవు ప్రకటిస్తూ జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాలకు ఈనెల 10, 11, 13 తేదీల్లో సెలవు ప్రకటించినట్లు తెలిపారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.