News March 24, 2025

ములుగు: అటవీ ప్రాంతంలో మృతదేహం కలకలం 

image

తాడ్వాయి మండలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. తాడ్వాయి మేడారం మధ్య విండ్ ఫాల్ అడవి ప్రాంతంలో కుళ్లిన మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మాట్లాడుతూ.. మేడారం మినీ జాతరకు కుటుంబ సభ్యులతో వచ్చి తప్పిపోయాడని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మతిస్థిమితం లేని సదరు వ్యక్తి అడవిలో తిరుగుతూ ఆహారం, నీరు లేక చనిపోయి ఉండవచ్చన్నారు. 

Similar News

News December 3, 2025

GNT: జడ్పీ నిధుల విడుదలకు మంత్రి అనగాని హామీ

image

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌కు రావాల్సిన బకాయిలపై జడ్పీ ఛైర్‌ పర్సన్ హెనీ క్రిస్టినా బుధవారం మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిశారు. రిజిస్ట్రేషన్ సర్ చార్జీల కింద 2022 నుంచి రావాల్సిన రూ.35.71 కోట్లను విడుదల చేయాలని కోరారు. గుంటూరుకు రూ.22.34 కోట్లు, పల్నాడుకు రూ.11.19 కోట్లు, బాపట్లకు రూ.2.18 కోట్లు బకాయి ఉన్నాయన్నారు. స్పందించిన మంత్రి.. ఆర్థిక మంత్రి పయ్యావులతో మాట్లాడి నిధులు చేయిస్తానన్నారు.

News December 3, 2025

భూపాలపల్లి: ప్రధాన అస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించాలి: కలెక్టర్

image

జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది సమయ పాలన పాటించట్లేదని తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సమయ పాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసులుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే, పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అన్నారు. వైద్య కళాశాలల్లో రూ.75 లక్షల వ్యయంతో చేపడుతున్న అదనపు తరగతి గదుల భవనం త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని సూచించారు.

News December 3, 2025

స్థల సమస్య ఉన్న ప్రాంతాలపై నివేదిక ఇవ్వండి: కలెక్టర్

image

ఆసుపత్రి భవనాల నిర్మాణానికి స్థల సమస్య ఉన్న ప్రాంతాలపై కాటారం సబ్ కలెక్టర్, భూపాలపల్లి ఆర్డీవోకు నివేదికలు అందచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పంచాయతీ రాజ్, టీజీఈడబ్ల్యూఐడీసీ, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతి, నిధుల వినియోగంపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.