News February 3, 2025
ములుగు: ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.
Similar News
News November 28, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

విజయవాడ డివిజన్ పరిధిలో ఆధునీకరణ పనుల దృష్ట్యా జనవరిలో విశాఖ నుంచి బయలు దేరే పలు రైళ్లు రద్దు చేశారు.
➤ జనవరి 29,31న (12718) – రత్నాచల్ ఎక్స్ ప్రెస్
➤28నుంచి 30వరకు (17239) సింహాద్రి ఎక్స్ ప్రెస్
➤29 నుంచి 31వరకు (17240) సింహాద్రి ఎక్స్ ప్రెస్
➤ 29,30న (12806) జన్మభూమి ఎక్స్ ప్రెస్
➤ 28,29న (12805)జన్మభూమి ఎక్స్ ప్రెస్
➤ 29,31న (67285, 67286) రాజమండ్రి -విశాఖ MEMU పాసెంజర్ రద్దు చేశారు.
News November 28, 2025
సత్యసాయి జిల్లా యువతికి అరుదైన ఛాన్స్

సత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంభాలట్టికి చెందిన దీపికకు అరుదైన గౌరవం దక్కింది. టీమ్ ఇండియా అంధుల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఇటీవల టీ20 ప్రపంచకప్‌ను గెలిపించిన దీపిక, గురువారం జట్టు సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దీపిక ప్రధానితో ఫొటో దిగారు. ప్రధాని మోదీ ఆమెను అభినందించారు.
News November 28, 2025
వర్ని: సర్పంచ్ ఎలక్షన్స్.. రెండు చోట్ల ఏకగ్రీవ తీర్మానం

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ తండా, చెలక తండా గ్రామపంచాయతీల సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కొక్కరే నామినేషన్ వేయాలని స్థానికులు తీర్మానం చేశారు. గ్రామాల అభివృద్ధికి, ఐక్యతకు నిదర్శనంగా ఏకగ్రీవంగా ఎన్నికలు చేసుకోవాలని తీర్మానించారు. సిద్దాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా బాల్సింగ్, చెలక తండా సర్పంచ్ అభ్యర్థిగా గంగారాం మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.


