News February 3, 2025
ములుగు: ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.
Similar News
News February 16, 2025
నా పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్ ఖాతాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేరుతో కొందరు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించారని ఆమె పేర్కొన్నారు. ఆయా ఫేస్బుక్ ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దన్నారు. జిల్లా కలెక్టర్ పేరుతో, ఫొటోలతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాలు నకిలీవని, ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించామన్నారు.
News February 16, 2025
రేపు భారత్‌కు ఖతర్ అమీర్

ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్-థనీ రేపు, ఎల్లుండి భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని ఆహ్వానం మేరకు అమీర్ భారత్‌కు వస్తున్నారని.. రాష్ట్రపతి, PM మోదీతో ఆయన భేటీ అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంపై ఈ పర్యటనలో చర్చలు జరుగుతాయని పేర్కొంది. 2015 మార్చిలో ఆయన తొలిసారి భారత్‌లో పర్యటించగా ఇది రెండో పర్యటన అని వెల్లడించింది.
News February 16, 2025
జనగామ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 84 మంది గైర్హాజరు

జనగామ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 84 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డిఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. మొదటి సెషన్‌లో 573 మంది విద్యార్థులకు గాను 509 విద్యార్థులు హాజరైయ్యారు. రెండవ సెషన్‌లో 397 మంది విద్యార్థులకు గాను 377 విద్యార్థులు హాజరయ్యారన్నారు.