News March 1, 2025
ములుగు: ‘ఆయనకు MLC టికెట్ ఇవ్వాలి’

బీసీ కోటాలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు అశోక్‌కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని తాడ్వాయిలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సతీశ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి కోరారు. సామాజిక కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగిన వ్యక్తి అశోక్ అని, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి నిత్యావసర వస్తువులు అందించారని, బీసీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.
Similar News
News February 23, 2026
పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు 133 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 136 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 62 మంది కస్టోడియన్లను నియమించినట్లు పేర్కొన్నారు. మాల్‌ప్రాక్టీస్ నిరోధానికి ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రవాణా సౌలభ్యం కోసం 11 మంది రూట్ అధికారులను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
News February 23, 2026
జగిత్యాల గ్రీవెన్స్ డేలో 14మంది వినతి

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ 14 మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
News February 23, 2026
TU: ప్రారంభమైన ఎల్ఎల్‌బీ 5వ సెమిస్టర్ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎల్‌ఎల్‌బీ ఐదో సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 28 మంది విద్యార్థులకు గాను 27 మంది విద్యార్థులు హాజరుకాగా 1(ఒకరు) గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఇటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని తెలిపారు.


