News February 26, 2026
ములుగు: ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 45 మంది గైర్హాజరు

జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 1,832 మంది విద్యార్థులు ఉండగా, తొలి పరీక్షకు 1,787 మంది హాజరయ్యారు. 45 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలు ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా ఇంటర్ విద్య అధికారి వీరేందర్ తెలిపారు.
Similar News
News April 16, 2026
పెద్దపల్లి: ఓపెన్ స్కూల్ పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు చేయాలి: డీఈవో

పెద్దపల్లి జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరిగే ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు 11 కేంద్రాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శారద ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పని చేసి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపారు. భద్రత, పర్యవేక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

డీలిమిటేషన్ బిల్లుపై SCకి వెళ్తాం: DMK

డీలిమిటేషన్ బిల్లును LSలో కేంద్రం ఆమోదింపజేసుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని DMK పేర్కొంది. ‘దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు న్యాయపరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’ అని ఆ పార్టీ లీగల్ వింగ్ సెక్రటరీ NR ఇలాంగో వెల్లడించారు. కాగా బిల్లును వ్యతిరేకిస్తున్న TN, WB రాష్ట్రాలకు LSలో 80మంది సభ్యులున్నారని, ఈ దశలో బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదని ఆర్గనైజింగ్ సెక్రటరీ RS భారతి వివరించారు.