News March 7, 2025

ములుగు: ఇన్‌స్పైర్ అవార్డు ఎంపికైన మధునిత

image

ములుగు పట్టణానికి చెందిన తీర్థాల రామన్న కూతురు మధునిత 2024-2025 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆటోమేటిక్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ వెహికల్ యూజింగ్ ప్రదర్శనకు అవార్డు పొందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబరిచిన మధునితను పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.

Similar News

News December 9, 2025

కడప మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

image

కడప నగర మేయర్ ఎన్నికకు సంబంధించి ఈనెల 11వ తేదీన ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అయితే ఈ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వం ఈ ఎన్నికను సక్రమంగా నిర్వహించడం లేదంటూ ఎన్నిక చల్లదంటూ వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎన్నిక నిర్వహణపై ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఈ ఎన్నిక నిర్వహణపై తీర్పును రేపు ఉదయానికి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.

News December 9, 2025

చిత్తూరు: 12న అంగన్వాడీల ఆందోళన

image

అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12వ తేదీ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని యూనియన్ లీడర్ సరస్వతి తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పులిచెర్లలో సీడీపీవోకు అందజేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పథకాలు అమలు చేయాలని, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు, జీతాలు పెంచాలని, మెడికల్ లీవ్ ఇవ్వాలని, పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని కోరారు.

News December 9, 2025

32,479 సంఘాలకు రుణం ఇవ్వాలి: బాపట్ల కలెక్టర్

image

పొదుపు మహిళలు జిల్లాలో అధికంగా ఉన్నందున 32,479 సంఘాలకు రుణం ఇవ్వాలని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం చెప్పారు. 10,957 సంఘాలకు రుణాలు మంజూరు కాగా, ప్రస్తుతం 3,979 సంఘాలకు మాత్రమే రూ.604.02 కోట్ల రుణాలు ఇవ్వడం ఏమిటని ఆరా తీశారు. పొదుపు మహిళలకు అధికంగా రుణ సదుపాయం కల్పించాల్సి ఉండగా, ఆశించిన స్థాయిలో రుణాలు ఇవ్వకపోవడపై ధ్వజమెత్తారు.