News March 7, 2025
ములుగు: ఇన్‌స్పైర్ అవార్డు ఎంపికైన మధునిత

ములుగు పట్టణానికి చెందిన తీర్థాల రామన్న కూతురు మధునిత 2024-2025 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆటోమేటిక్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ వెహికల్ యూజింగ్ ప్రదర్శనకు అవార్డు పొందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబరిచిన మధునితను పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.
Similar News
News April 17, 2026
ఆదిలాబాద్: మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ షురూ

ఆదిలాబాద్ మున్సిపాలిటిలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నలుగురు సభ్యులను ఎన్నుకునేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో ఇద్దరు మైనారిటీలు, ఇద్దరు ఇప్పటికే కౌన్సిలర్లుగా పని చేసిన వారిని ఎన్నుకొనగా.. రెండు విభాగాల్లో ఒక మహిళ సభ్యురాలు ఉండనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 25లోపు పూర్తి వివరాలను సమర్పించాలని కమిషనర్ రాజు తెలిపారు.
News April 17, 2026
పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ విచారణ

భద్రాద్రి జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. గతంలో జరిగిన అకస్మిక తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కీలక పత్రాల ఆధారంగా ఖమ్మం ఏసీబీ సీఐ బాలాజీ నేతృత్వంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో మున్సిపల్ సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ తనిఖీలతో కార్యాలయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది.
News April 17, 2026
నిర్మల్: ఈనెల 20 నుంచి టీసీఏ T20 సూపర్ లీగ్

WRGL వేదికగా ఈనెల 20 నుంచి TCAL స్టార్ T20 సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లా నుంచి గత టోర్నీలో రాణించిన క్రీడాకారులతో కూడిన 6 జట్లను ప్రకటించారు. గ్రామీణ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీయడంలో TCA కీలక పాత్ర పోషిస్తోందని కోచ్ రామరాజు కొనియాడారు. HCA పట్టించుకోకున్నా.. TCA ఏటా టోర్నీలు నిర్వహిస్తూ యువతకు అండగా నిలుస్తోందన్నారు. దీంతో కొత్త క్రికెటర్లు వెలుగులోకి రావాలని రామరాజు ఆకాంక్షించారు.


