News February 1, 2025

ములుగు: ‘ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాటు చేయాలి’

image

శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. 24 గంటలు, 48 గంటలు, 72 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్టు అందించాలన్నారు.

Similar News

News February 25, 2026

ప్రజారోగ్య రక్షణలో ప్రభుత్వం విఫలం: జగన్

image

AP: శ్రీకాకుళం <<19230296>>డయేరియా<<>> ఘటనపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి వనరుల పరిశుభ్రత, క్లోరినేషన్, మురుగునీటి నిర్వహణలో తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

News February 25, 2026

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

image

కర్నూలు రూరల్ సర్కిల్ ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అశోక ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీ లైబ్రేరియన్ పేరం భైరవి రోడ్డు దాటుతుండగా డోన్ వైపు నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భైరవి, బైక్ రైడర్ ఆవుల అరవింద్ తీవ్రంగా గాయపడ్డారు. GGHలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 25, 2026

చరిత్ర సృష్టించిన బ్రూక్

image

ఇంగ్లండ్ బ్యాటర్ హారీ బ్రూక్ చరిత్ర సృష్టించారు. T20 WCలో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా రికార్డులకెక్కారు. సూపర్-8లో పాక్‌పై శతకంతో ఈ ఘనత అందుకున్నారు. అతడి తర్వాత అత్యధిక స్కోర్ గేల్ (98) పేరిట ఉంది. అతడు 2010 T20 WCలో టీమ్ ఇండియాపై 98 రన్స్ చేశారు. మరోవైపు T20WCలో ఇది నాలుగో వేగవంతమైన సెంచరీ. బ్రూక్ ఇవాళ 50 బంతుల్లో సెంచరీ చేయగా.. గేల్ 2016లో 47, 2007లో 50 బంతుల్లో శతకాలు బాదారు.