News February 1, 2025
ములుగు: ‘ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాటు చేయాలి’

శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. 24 గంటలు, 48 గంటలు, 72 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్టు అందించాలన్నారు.
Similar News
News February 13, 2025
హిందూపురం అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలి: కలెక్టర్

హిందూపురం నియోజకవర్గం అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో హిందూపురం నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గం దార్శనిక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే సలహాలు తీసుకొని నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు.
News February 13, 2025
కడప: హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన

బైక్ నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు కడప జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ ధారణపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బైక్ నడిపే సమయంలో ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు.
News February 13, 2025
శుభ ముహూర్తం (13-02-2025)

✒ తిథి: బహుళ పాడ్యమి రా.7.47 వరకు
✒ నక్షత్రం: మఖ రా.8.48 వరకు
✒ శుభ సమయం: సా.5.24 నుంచి సా.6.14 వరకు
✒ రాహుకాలం: మ.1.30 నుంచి మ.3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00 నుంచి ఉ.7.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: ఉ.8.11 నుంచి ఉ.9.52 వరకు,
✒ అమృత ఘడియలు: సా.6.16 నుంచి రా.7.56 వరకు