News February 17, 2025
ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించాలి: చిరంజీవి

ఉమ్మడి వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి పూల రవీందర్‌ను గెలిపించాలని రాష్ట్ర బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ చిరంజీవి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90% ఓటర్లు బహుజనులు ఉన్నారని, బహుజనుల ఓటు బహుజన అభ్యర్థులకే వేయాలని అన్నారు. పూల రవీందర్ గెలుపు కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చిరంజీవి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Similar News
News March 8, 2026
మహబూబాబాద్: మహిళలపై పెరుగుతున్న దాడులు

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడాది కాలంగా మహిళలపై అనేక దాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 176 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. 42 ఈవ్ టీజింగ్ కేసులు, 55 అత్యాచారం కేసులు, 5 వరకట్న హత్యల కేసులు, 9 మహిళల హత్యల కేసులు, 178 అత్యాచారయత్నం కేసులు నమోదయ్యాయి. మహిళలపై వేదింపుల కేసులను షీ టీం పోలీస్ స్టేషన్లు పరిష్కారించనుంది.
News March 8, 2026
అనకాపల్లి: ‘అమ్మా, నాన్న సారీ’.. సూసైడ్ నోట్‌లో విద్యార్థిని

గొలుగొండ(M) ఏఎల్ పురం జడ్పీ హైస్కూల్లో 10th విద్యార్థిని వింజరపు దుర్గా లక్ష్మి తరగతి గదిలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది. ‘అమ్మానాన్న సారీ.. తమ్ముణ్ని బాగా చూసుకోండి, నాకు స్నేహితులందరూ ఇష్టమే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నానని’ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. గత కొద్ది రోజులుగా బాలిక ముభావంగా ఉన్నట్లు తోటి స్నేహితులు చెప్పినట్లు సమాచారం.
News March 8, 2026
చమురు ఉత్పత్తిని నిలిపేసిన మరో దేశం!

చమురు ఉత్పత్తి, ఎగుమతులను నిలిపేస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరాన్ దాడులు, హార్ముజ్ జలసంధి మూతతో ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు అనుకూలించాక ప్రొడక్షన్ తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది. OPECలో 5వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు కువైట్. సగటున రోజుకు 2.6M బ్యారెళ్లు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఖతర్, ఇరాక్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. UAE కూడా క్రూడాయిల్ ప్రొడక్షన్ కట్ చేస్తున్నట్లు తెలిపింది.


