News February 18, 2025
ములుగు: ‘ఎస్సై వేధిస్తున్నాడు.. ఆత్మహత్యకు అనుమతించండి’

ములుగు జిల్లాకు చెందిన ఓ ఎస్సై, అతడి కుటుంబీకులు వేధింపులకు గురిచేస్తున్నారని, ఆత్మహత్యకు అనుమతించాలని మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన- ప్రతాప్ రెడ్డి దంపతులు భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.దంపతులకు గ్రామంలో ఉన్న 12 ఎకరాల భూమికి చెందిన బండ్ల బాటను ఎస్సై, అతడి కుటుంబీకులు 2022 మే 15న దున్ని వారి భూమిలో కలుపుకొన్నారన్నారు. కేసులు పెట్టి ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు.
Similar News
News November 23, 2025
పొల్యూషన్ నుంచి కాపాడే ఫుడ్స్ ఇవే

ప్రస్తుతం వాయుకాలుష్యం పెద్ద సమస్యగా మారింది. లైంగిక పరిపక్వత, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే బెర్రీస్, బ్రోకలీ, పసుపు, ఆకుకూరలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు కలిగిన విభిన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల కాలుష్యం నుంచి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారని చెబుతున్నారు.
News November 23, 2025
సముద్రంలో దిగి కోనసీమ బాలుడి గల్లంతు

సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన తెన్నేటి మహిమరాజు (14) ఆదివారం సముద్రంలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. మలికిపురం ఎస్ఐ సురేష్ వివరాల మేరకు.. బాలుడు ముగ్గురు స్నేహితులతో కలిసి మలికిపురం మండలం చింతలమోరి బీచ్లో స్నానానికి దిగాడు. కెరటాలకు సముద్రంలో కొట్టుకు పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 23, 2025
NGKL: వృద్ధురాలితో భూమిపూజ చేయించిన మంత్రి జూపల్లి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో మంజూరైన ఇందిరమ్మ ఇంటికి భూమిపూజకు మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. భర్తను కోల్పోయిన లక్ష్మిదేవమ్మ కుమారుడు పేరుతో ఇల్లు మంజూరు చేశారు. ఆయన భార్య గర్భిణి కావడంతో పూజలో పాల్గొనలేదు. లక్ష్మిదేవమ్మ భూమిపూజ చేయాలని మంత్రి కోరగా ఆమె వితంతువు అని స్థానికులు చెప్పారు. ఇలాంటి సాంఘిక దురాచారాలు నమ్మడం మంచిది కాదని ఆమెతో మంత్రి పూజ చేయించారు.


