News February 18, 2025
ములుగు: ‘ఎస్సై వేధిస్తున్నాడు.. ఆత్మహత్యకు అనుమతించండి’

ములుగు జిల్లాకు చెందిన ఓ ఎస్సై, అతడి కుటుంబీకులు వేధింపులకు గురిచేస్తున్నారని, ఆత్మహత్యకు అనుమతించాలని మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన- ప్రతాప్ రెడ్డి దంపతులు భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.దంపతులకు గ్రామంలో ఉన్న 12 ఎకరాల భూమికి చెందిన బండ్ల బాటను ఎస్సై, అతడి కుటుంబీకులు 2022 మే 15న దున్ని వారి భూమిలో కలుపుకొన్నారన్నారు. కేసులు పెట్టి ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు.
Similar News
News March 28, 2025
పెద్దపల్లి: రేషన్‌షాపుల్లో సన్నబియ్యం.. అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. దీంతో పెద్దపల్లి జిల్లాలో 2,19,952 మంది లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది. ఇది వరకు రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని అమ్ముకునేందుకు మొగ్గుచూపే వారు. ఇక నుంచి సన్నబియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ చేయడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్ పడినట్టయ్యింది.
News March 28, 2025
కొనకనమిట్ల: తమ్ముడి కళ్ల ఎదుటే అన్న మృతి

చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొనకనమిట్ల(M) సిద్దవరానికి చెందిన చప్పిడి రమేశ్ (25) తమ్ముడు చిన్నాతో బైకుపై వెళ్తున్నారు. ముందుగా వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నాకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తమ్ముడి కళ్లదుటే అన్న మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 28, 2025
HYD: అసైన్మెంట్ గడువు పొడిగింపు

ఉస్మానియా విశ్వవిద్యాలయం జి.రామ్ రెడ్డి దూర విద్యలో UG, PG విద్యార్థులకు అసైన్మెంట్ గడువు ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. అధికారిక ప్రకటన విడుదల చేసిన అధికారులు, ఇది తుదిగడువు అని స్పష్టం చేశారు. నిర్ణీత సమయానికి సమర్పించని విద్యార్థుల అసైన్మెంట్లు తిరస్కరిస్తామని హెచ్చరించారు. గడువు దాటిన తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.