News March 24, 2025
ములుగు: కనుమరుగవుతున్న వన్యప్రాణులు!

రాష్ట్రంలోనే అభయారణ్యంగా పేరుగాంచిన ములుగు జిల్లా అడవుల్లో వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయి. వేటగాళ్ల అమర్చిన ఉచ్చులు, విద్యుత్ తీగలకు బలైపోతున్నాయి. ఏజెన్సీ అటవీ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు అప్పుడప్పుడు జింకలు, దుప్పులు, అడవి బర్రెలు దర్శనమిచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని వన్యప్రాణి ప్రేమికులు వాపోతున్నారు. అటవీ అధికారులు, పోలీసులు వేటగాళ్లపై దాడులు చేసిన తీరు మారడం లేదన్నారు.
Similar News
News December 13, 2025
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. పండుగకి నెలకొనే రద్దీ దృష్ట్యా జనవరి 8వ తేదీ నుంచే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా APలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. స్పెషల్ ట్రైన్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ <
News December 13, 2025
బుట్టాయగూడెం: గురుకుల పాఠశాలలో తనిఖీలు

ఏపీ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్ శనివారం బూసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వసతులు, విద్యాబోధన తీరును పరిశీలించిన ఆయన, అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యత, రుచి ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
News December 13, 2025
చుంచుపల్లి: మున్సిపాలిటీ-పంచాయతీని వేరు చేస్తున్న హైవే

చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ నెలకొన్న భౌగోళిక పరిస్థితి అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తోంది. హైవే మున్సిపాలిటీని, పంచాయతీని వేరు చేస్తోంది.
ప్రశాంతినగర్, కొత్తగూడెం మున్సిపాలిటీలను హైవే విభజిస్తోంది. హైవేకి తూర్పున ఉన్న ప్రాంతం పంచాయతీ పరిధిలోకి రాగా, పడమర ప్రాంతం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఈ పంచాయతీలో 1633 మంది ఓటర్లు ఉన్నారు.


