News March 20, 2025
ములుగు కలెక్టర్ కీలక ఆదేశాలు

ములుగు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అన్నారు. గురువారం పరీక్షల నిర్వహణ, విద్యాశాఖ సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, ఇద్దరు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు ఎలాంటి కరెంటు కోతలు ఉండవద్దన్నారు.
Similar News
News March 31, 2025
వివాహితపై సామూహిక అత్యాచారం

TG: నాగర్ కర్నూల్ (D) ఊర్కొండ(M)లో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. MBNR జిల్లాకు చెందిన ఆమె బంధువుతో కలిసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాలకృత్యాల కోసం గుట్ట ప్రాంతానికి వెళ్లగా, 8 మంది ఆ బంధువుపై దాడి చేసి అతని చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ తర్వాత వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనకు పాల్పడ్డ వారిని గుర్తించిన పోలీసులు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
News March 31, 2025
NZB: సనాతన ధర్మాన్ని, సనాతన సంప్రదాయాలను కాపాడాలి: MLA

సనాతన ధర్మాన్ని, సనాతన సంప్రదాయాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. ఆదివారం ఆయన నగరంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో, పలు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. బస్వా గార్డెన్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇందూరు నగర శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవితం అంటేనే సుఖ దుఃఖాల కలయిక అని పేర్కొన్నారు.
News March 31, 2025
అల్లూరి జిల్లాలో చికెన్ రేటు ఎంతంటే?

అల్లూరి జిల్లాలో చికెన్ ధరలు సోమవారం పెరిగాయి. స్కిన్ లెస్ బ్రాయిలర్ కిలో రూ.300కాగా, స్కిన్‌తో రూ.280 వరకు అమ్ముతున్నారు. ఆదివారం ఉగాది కావడంతో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉన్నారు. సోమవారం రంజాన్ పండుగ కూడా కావడంతో మాంసం కొనుగోళ్లు బాగా పెరిగాయి. దుకాణాలన్నీ వినియోగదారులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ధరలు పెరిగినట్లు పలువురు చెబుతున్నారు.