News April 9, 2025
ములుగు కలెక్టర్ పనితీరు అద్భుతం

ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర పనితీరు అద్భుతంగా ఉందని ములుగు జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు వంగ రవి యాదవ్ అన్నారు. బుధవారం కలెక్టర్ దివాకర జన్మదిన పురస్కరించుకొని కలెక్టరేట్ కార్యాలయంలో రవి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ములుగు జిల్లా అధికార ప్రతినిధి ఎండి అహ్మద్ భాషా, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Similar News
News April 21, 2025
నూజివీడు: విహారయాత్రకు వెళ్లి విషాదం నింపాడు

నూజివీడు మండలం బత్తుల వారి గూడెం గ్రామానికి చెందిన యువకుడు పావులూరి శ్యామ్ కుమార్ (20) ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి రేవు వద్ద విహారయాత్రకు వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్యాం కుమార్ ఐటీఐ చదివి అప్రెంటిస్ పూర్తి చేసుకుని విజయవాడలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
News April 21, 2025
V.M.R.D.Aకు ఇన్‌ఛార్జ్ కమిషనర్

V.M.R.D.A. మెట్రోపాలిటన్ కమిషనర్ K.S. విశ్వనాథన్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (M.M.R.D.A.) కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు సోమవారం ముంబై వెళ్లారు. 22వ తేదీన కూడా ఆయన అధ్యయనం ముంబైలో ఉంటారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌ని ఇన్ ఛార్జ్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
News April 21, 2025
BHPL: తేలనున్న 3,615 మంది భవితవ్యం

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 3,615 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 1,820 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,795 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. >ALL THE BEST