News August 28, 2024
ములుగు: గవర్నర్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటారు: సీతక్క

ములుగు జిల్లాలోని ఏదైనా ఓ గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసుకుంటానని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ తెలిపారని సీతక్క అన్నారు. గవర్నర్ పర్యటన ప్రశాంతంగా ముగిసిందన్నారు. సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్గా నియామకమైన అనంతరం మొదటిసారి ములుగు జిల్లాకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ పర్యటనలో సహకరించిన ప్రతి ఒక్కరికి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 11, 2025
వర్ధన్నపేట: ఫలితం డ్రా.. చిట్టీలు వేసి ప్రకటన

వర్ధన్నపేట మండలంలోని అంబేడ్కర్ నగర్లో 1వ వార్డు ఫలితాన్ని డ్రా ద్వారా నిర్ణయించారు. ఈ వార్డులో మొత్తం 101 ఓట్లు ఉండగా 91 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతు దారురాలు బొక్కల రజనీకి 31 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి గోకల రూపకు 31 ఓట్లు రావడంతో సమాన ఫలితం నమోదైంది. దీంతో నియమాల ప్రకారం ఎన్నికల అధికారులు చిట్టీలు వేసి విజేతను నిర్ణయించారు. గోకల రూపకు అదృష్టం వరించి విజేతగా నిలిచింది.
News December 11, 2025
వరంగల్ జిల్లాలో 61% పోలింగ్ @11AM

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు గాను జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 61% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పర్వతగిరిలో 65.57, రాయపర్తిలో 59.78, వర్ధన్నపేటలో 57.45% నమోదయింది. కాగా, పోలింగ్కు ఇంకా రెండు గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
News December 10, 2025
WGL: పల్లెల్లో ఎన్నికల పండగ..!

ఉమ్మడి WGL జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం తొలి విడత జరగనుంది. పల్లెల్లో ఎన్నికల పర్వం పండగ వాతావరణం సృష్టించగా, అభ్యర్థుల గుణగణాల మీద చర్చలు జోరందుకున్నాయి. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా, అభ్యర్థులు పార్టీ కండువాలతోనే ప్రచారం చేస్తూ ఊర్లో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. బయట ఉన్న ఓటర్లకు ఫోన్లు చేసి రానుపోను ఖర్చులు ఇస్తామని చెబుతున్నారు.


