News March 11, 2025
ములుగు: గిరిజన యూనివర్సిటీ వీసీ నియామకం

ములుగు జిల్లా సమక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్‌ను భారత ప్రభుత్వం/ కేంద్ర విద్యా శాఖ నియమించింది. హైదరాబాదులోని ఆరోరా హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీకి చెందిన ప్రొఫెసర్ యెడవల్లి లక్ష్మీ శ్రీనివాస్‌ను నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
Similar News
News February 8, 2026
వరంగల్: మల వ్యర్థాలు బహిరంగంగా వేస్తే జైలుకే!

మల వ్యర్థాలను బహిరంగంగా పారబోస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం శానిటేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో సానిటరీ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు.
News February 7, 2026
వరంగల్: ఉపాధి పనులు ముమ్మరం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించి, కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం ఎంపీడీవోలు, ఏపీవోలతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల పురోగతిలో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి పాల్గొన్నారు.
News February 7, 2026
వరంగల్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

2026-28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ప్రస్తుత కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనుండటంతో కొత్త వాటి కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాచార పౌరసంబంధాల శాఖ నిబంధనల మేరకు పకడ్బందీగా అక్రిడిటేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.


