News May 24, 2024

ములుగు: గుండె మార్పిడితో మరొకరికి ప్రాణదానం

image

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడు మరో మనిషికి ప్రాణం పోశాడు. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన షేక్ షానాజ్‌కు గుండె సంబంధిత సమస్య ఉంది. గుండె మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడికి 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో నిమ్స్ వైద్యులు అతడి గుండెను మార్పిడి చేసి షానాజ్‌కు విజయవంతంగా అమర్చారు.

Similar News

News February 18, 2025

కేయూ: 105 మంది విద్యార్థినులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు 

image

కేయూ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థినులు 105 మంది వివిధ సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.భిక్షాలు తెలిపారు. ఇన్ఫోసిస్‌లో ఇద్దరు, డిజిగీక్స్‌ ముగ్గురు, జెన్‌పాక్ట్‌ 35 మంది, డెల్ఫిటీవీఎస్‌ 18 మంది, క్యూస్ప్రైడర్‌ 33 మంది, పెంటగాన్‌ స్పేస్‌ 10 మంది, ఎకోట్రైన్స్‌లో నలుగురు ఎంపికయ్యారని చెప్పారు. వీరిని అధ్యాపకులు అభినందించారు.

News February 18, 2025

వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్‌ బస్సులు: టీకే శ్రీదేవి

image

వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్‌ బస్సులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నివేదిక సమర్పించాలని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టరేట్‌ డాక్టర్‌ టీకే శ్రీదేవి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  భారత ప్రభుత్వం ‘పీఎం ఈ-బస్‌ సేవా పథకం’లో భాగంగా వరంగల్‌ నగరానికి జనాభా ప్రాతిపదికన 100 ఎలక్ట్రిక్‌ బస్సులను నిర్వహణ కోసం బల్దియాకు అందజేయనున్నట్లు తెలిపారు.

News February 18, 2025

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

మార్చి 5 నుంచి జరిగే ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద దేవి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు రాసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులున్నారు.

error: Content is protected !!