News February 9, 2025

ములుగు: గుప్పుమంటున్న గుడుంబా

image

కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Similar News

News February 9, 2025

రేపటి నుంచి ‘భాగ్యనగర్’ బంద్

image

TG:ఉత్తర తెలంగాణ వాసుల వరప్రదాయిని భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ 11 రోజుల పాటు నిలిచిపోనుంది. 3వ లైన్ పనుల కారణంతో సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య నడిచే ఈ రైలు రాకపోకలను ఈ నెల 10 నుంచి 21 వరకు నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, పొత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ వరకు దీనిలో నిత్యం ప్రయాణించేవారుంటారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు తిప్పలు తప్పవు.

News February 9, 2025

‘తండేల్’ సినిమాలో మూలపేట మహిళ

image

ఇటీవల విడుదలైన ‘తండేల్’ సినిమాలో నటించే అరుదైన అవకాశం మూలపేటకు చెందిన రాజ్యలక్ష్మి (రాజి)కి దక్కింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం సముద్ర తీర ప్రాంతమైన మూలపేట గ్రామానికి చెందిన ఆమె, ఇంతకుముందు పలు సీరియల్, సినిమాల్లో నటించారు. కూలీ నిమిత్తం వెళ్లి పాకిస్థాన్ జైల్లో ఉంటున్న వ్యక్తి భార్యగా, ఆమె మత్స్యకార మహిళ పాత్రలో ‘తండేల్’ సినిమాలో నటించడం విశేషం.

News February 9, 2025

చిత్తూరు: మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు

image

చిత్తూరు జిల్లాలో కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించిన పది మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. తొలుత దరఖాస్తులకు ఐదో తేదీ వరకే గడువు విధించడంతో 13 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో గడువును 8వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. దరఖాస్తుదారులకు సోమవారం లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

error: Content is protected !!