News February 9, 2025
ములుగు: గుప్పుమంటున్న గుడుంబా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739031465375_1047-normal-WIFI.webp)
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Similar News
News February 9, 2025
NKP: చెర్వుగట్టులో ఘనంగా పూర్ణాహుతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739070696402_50283763-normal-WIFI.webp)
చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, ఏకాంత సేవలను వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఆర్చక బృందం ఆధ్వర్యంలో మహా పూర్ణహుతి, హోమం, ధ్వజారోహణం, ఏక దశ రుద్రాభిషేకం, జ్యోతి లింగార్చన, ఏకాంతసేవ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆయల ఈఓ నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
News February 9, 2025
వెంకన్న సేవలో మంత్రి సవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739063139832_14916343-normal-WIFI.webp)
మంత్రి సవిత ఆదివారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆమెకు శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
News February 9, 2025
ప్రకాశం జిల్లా పునర్విభజనపై మీ కామెంట్..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739074476108_689-normal-WIFI.webp)
అద్దంకిని బాపట్ల, కందుకూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేశారు. ఆ రెండు ఏరియాల ప్రజలకు గతంలో 50KM లోపే జిల్లా కేంద్రం(ఒంగోలు) ఉండేది. ఇప్పుడు ఆ దూరం పెరిగింది. ప్రస్తుతం మార్కాపురాన్ని జిల్లా చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలోనే అద్దంకి, కందుకూరును తిరిగి ప్రకాశంలో కలపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి మీ ఏరియాను మార్కాపురం లేదా ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఉంచాలో కామెంట్ చేయండి.