News February 9, 2025
ములుగు: గుప్పుమంటున్న గుడుంబా

కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Similar News
News March 26, 2025
టెన్త్ ఎగ్జామ్ సరిగా రాయలేదని..

TG: పది పరీక్ష సరిగా రాయలేదని తనువు చాలించిందో విద్యార్థిని. నల్గొండ(D) కట్టంగూర్‌కు చెందిన పూజిత భార్గవి(15) ప్రస్తుతం జరుగుతున్న టెన్త్ పరీక్షలకు హాజరవుతోంది. సోమవారం జరిగిన ఇంగ్లిష్ ఎగ్జామ్ సరిగా రాయలేదని మనస్తాపానికి గురైంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
* జీవితంలో ఎగ్జామ్ ఓ భాగం మాత్రమే. పరీక్షల్లో ఫెయిలైనా లైఫ్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారెందరో ఉన్నారు.
News March 26, 2025
GNT: 29న జాతీయ స్థాయిలో పోటీలకు ఆడిషన్స్

జాతీయ స్థాయిలో MRS&PLUSE సైజ్ గోర్జియస్ ఇండియా పోటీలకు మోంటి ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో అడిషన్స్ నిర్వహిస్తున్నట్లు AP జోనల్ హెడ్ వాసవి అగర్వాల్ బుధవారం తెలిపారు. ఈనెల 29న గుంటూరు లాడ్జిసెంటర్ నాయుడు పేట 3వ లైన్‌లో ఆసీఫ్ రాయ్ డాన్స్ స్టూడియోలో ఉదయం 11 గంటల నుంచి ఆడిషన్స్ జరుగుతాయని చెప్పారు. ఆడిషన్స్‌లో పాల్గొనే వారు ఈ 9618500676 నంబర్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.
News March 26, 2025
KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు..

KNR జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా తిమ్మాపూర్ మండలంలో 39.6°C నమోదు కాగా, గంగాధర 39.5, మానకొండూర్ 39.4, జమ్మికుంట 39.3, ఇల్లందకుంట 39.0, కరీంనగర్ 38.9, రామడుగు, చిగురుమామిడి 38.7, శంకరపట్నం 38.4, గన్నేరువరం 38.0, వీణవంక 37.7, కొత్తపల్లి 37.6, కరీంనగర్ రూరల్ 37.3, చొప్పదండి 37.0, హుజూరాబాద్ 36.8, సైదాపూర్ 35.5°C గా నమోదైంది.