News February 19, 2025

ములుగు: ఘనంగా మేడారం తిరుగువారం పండగ

image

మేడారంలో బుధవారం తిరుగు వారం పండుగను ఘనంగా నిర్వహించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు మహిళలు మంగళ హారతులతో ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం గద్దెల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుగు వారం సందర్భంగా సమ్మక్క తల్లి పుట్టిన ఊరు అయినా బయక్కపేటలోని సమ్మక్క గుడిలో కన్నేపల్లిలోని సారలమ్మ గుడిలో పూజలు ఘనంగా జరిగాయి. సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులకు తరలివచ్చారు.

Similar News

News September 16, 2025

మాడ్యులర్ కిచెన్ చేయిస్తున్నారా?

image

మాడ్యులర్ కిచెన్‌కు ఈ రోజుల్లో ఆదరణ పెరుగుతోంది. అయితే కిచెన్‌కి వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. సరకులు పెట్టుకోవడానికి అల్మారా, డీప్ డ్రా నిర్మించుకోవాలి. చాకులు, స్పూన్‌లు, గరిటెలు విడివిడిగా పెట్టుకొనేలా ఉండాలి. అప్పుడే వస్తువులు నీట్‌గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరుకుతుంది. వంటగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి వీలుగా అవసరమైన చోట ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి.

News September 16, 2025

దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించాలి: రమేశ్ బాబు

image

కాకినాడ జిల్లాలోని దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు సమావేశమయ్యారు. కాకినాడ బాలాత్రిపురసుందరి ఆలయంలో జరిగిన ఈ సమావేశంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. విజయవాడ, ఇతర ఆలయాలకు డిప్యూటేషన్‌పై వెళ్లేవారు ఒక రోజు ముందుగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆలయ నిధుల లావాదేవీలపై చర్చించారు.

News September 16, 2025

మేడారం గద్దెల విస్తరణలో వ్యూహాత్మకంగా ముందుకే..!

image

మేడారం వన దేవతల గద్దెల విస్తరణలో ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే జాతరలో ఇరుకైన ఈ ప్రాంగణం విస్తరణకు గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించగా సాధ్యం కాలేదు. ప్రస్తుత సర్కారు ప్రయత్నం మొదలు పెట్టింది. ఆదివాసీ సంఘాలు విబేధించడం, రాజకీయ ప్రమేయం పెరగడంతో మంత్రి సీతక్క వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన పూజారులతో కౌంటర్ ఇప్పిస్తున్నారు. విమర్శలకు చెక్ పెడుతున్నారు.