News February 19, 2025

ములుగు: ఘనంగా మేడారం తిరుగువారం పండగ

image

మేడారంలో బుధవారం తిరుగు వారం పండుగను ఘనంగా నిర్వహించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు మహిళలు మంగళ హారతులతో ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం గద్దెల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుగు వారం సందర్భంగా సమ్మక్క తల్లి పుట్టిన ఊరు అయినా బయక్కపేటలోని సమ్మక్క గుడిలో కన్నేపల్లిలోని సారలమ్మ గుడిలో పూజలు ఘనంగా జరిగాయి. సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులకు తరలివచ్చారు.

Similar News

News March 18, 2025

టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు

image

టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు గోడలపై దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో టెక్కలిలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద “దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్” అని రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఆకతాయిల పనే అని పలువురు అంటున్నారు. దీనిపై పలువురు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

News March 18, 2025

NRPT: కొట్టుకున్న మహిళలు.. ఒకరి మృతి

image

ఇద్దరు మహిళల మధ్య ఘర్షణలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా జలాల్ పూర్ గ్రామంలో మంగళవారం ఉదయం  జరిగింది. స్థానికుల మేరకు.. గ్రామ నర్సరీ వద్ద లక్ష్మి, మరో మహిళ బుజ్జమ్మ మధ్య ఓ విషయమై మాటా మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బుజ్జమ్మ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News March 18, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,500లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.90,000కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1100 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది. శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి.

error: Content is protected !!