News April 2, 2025
ములుగు: చర్చలకు మేము సిద్ధం.. ‘మావో’ లేఖ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు మేము సిద్ధమేనని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ములుగు జిల్లాలో ఓ లేఖ చెక్కర్లు కొడుతుంది. ఛతీస్ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో చేపట్టిన ‘కగార్’ వెంటనే విరమించాలని, బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ప్రతిపాదనలకు స్పందిస్తే తక్షణమే కాల్పులు విరమిస్తామన్నారు.
Similar News
News November 10, 2025
వంటింటి చిట్కాలు

*క్యాబేజీ కర్రీ వండినప్పుడు కాస్త పచ్చి వాసన వస్తుంటుంది. అది రాకుండా ఉండాలంటే.. కొద్దిగా నిమ్మరసం లేదా అల్లం ముక్క వేయండి.
* వంట చేసినప్పుడు చేతులు కాలితే బంగాళదుంపతో రుద్దితే మంట తగ్గుతుంది.
* దోశెల పిండి పులిస్తే అందులో కాస్త గోధుమ పిండి కలిపితే దోశెలు రుచిగా వస్తాయి.
* చెక్క గరిటలు వాసన వస్తుంటే కాస్త వెనిగర్ వేసిన నీటిలో పదినిమిషాలు నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి.
News November 10, 2025
వర్షపు నీటిని ఒడిసి పడదాం: ఎంపీ పెమ్మసాని

వర్షపు నీటిని ఒడిసి పట్టి.. జీవనాధారం పెంచుదామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ మహోత్సవ్పై రెండ్రోజుల జాతీయ సదస్సు గుంటూరు వెల్కమ్ గ్రాండ్ హోటల్లో సోమవారం ప్రారంభమైంది. పెమ్మసాని మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుందని, సీఎం చంద్రబాబు మంచి విజన్తో ఆ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.
News November 10, 2025
నటుడు అభినయ్ మృతి

నటుడు అభినయ్(44) మరణించారు. కొన్నేళ్లుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ చెన్నైలో కన్నుమూశారు. తన చివరి రోజుల్లో చికిత్సకు అవసరమైన డబ్బు కోసం ఆయన ఎదురుచూడాల్సి వచ్చిందని స్నేహితులు చెప్పారు. ధనుష్ తొలి సినిమా ‘థుల్లువాదో ఇళమై’తో అభినయ్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళ్, కన్నడలో సుమారు 15కు పైగా చిత్రాల్లో నటించారు. ఓరియో బిస్కెట్స్ సహా పలు యాడ్స్లోనూ కనిపించారు.


