News January 30, 2025
ములుగు: చలిమంటల్లో పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

చలి మంటల్లో పడి విద్యార్థి కాళ్లకు తీవ్ర గాయాలైన ఘటన ములుగు జల్లా ఏటూరునాగారం మండలం మల్యాల ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి జరిగింది. 3వ తరగతి చదువుతున్న భూదేశ్ అనే గుత్తికోయ విద్యార్థి చలి వేస్తుందని పాఠశాల ఆవరణలో చలిమంటల కోసం ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో అదుపుతప్పి భూదేశ్ మంటల్లో పడగా 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 11, 2025
విశాఖ: అబార్షన్ కిట్ అమ్ముతున్న మెడికల్ షాప్పై కేసు

డాక్టర్ మందులు చీటీ లేకుండా గర్భాన్ని తొలగించేందుకు వాడే మందులను అమ్ముతున్న మెడికల్ షాప్పై విశాఖ టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు. సీపీ సూచనలతో గోపాలపట్నంలోని దర్విన్ ఫార్మసీపై మంగళవారం దాడులు చేయగా ఆరు కిట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. దుకాణంపై కేసు నమోదు చేసి మందులను డ్రగ్ కంట్రోలర్ అప్పగిస్తామని వెల్లడించారు.
News November 11, 2025
నారాయణ పేట: ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

నారాయణపేట పట్టణంలోని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలో పీజీటీ ఉర్దూ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అబ్దుల్ అలీం ఉమ్మడి జిల్లా మైనారిటీ గురుకులాల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికయ్యారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎల్సి ఖాజా బహుద్దీన్.. అబ్దుల్ అలీంను సన్మానించి, జ్ఞాపికను అందించారు. పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News November 11, 2025
ఖమ్మం: వీధి కుక్కలకు వింత వ్యాధులు

జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాయి. అన్ని మండలాల్లో కుక్కల చర్మంపై భయంకరమైన మచ్చలు ఏర్పడి దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు వెంటనే స్పందించి, కుక్కలకు సోకిన ఈ వ్యాధిని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.


