News January 30, 2025
ములుగు: చలిమంటల్లో పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

చలి మంటల్లో పడి విద్యార్థి కాళ్లకు తీవ్ర గాయాలైన ఘటన ములుగు జల్లా ఏటూరునాగారం మండలం మల్యాల ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి జరిగింది. 3వ తరగతి చదువుతున్న భూదేశ్ అనే గుత్తికోయ విద్యార్థి చలి వేస్తుందని పాఠశాల ఆవరణలో చలిమంటల కోసం ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో అదుపుతప్పి భూదేశ్ మంటల్లో పడగా 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 14, 2025
జగిత్యాల: ఇద్దరు మహిళలు ARREST

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో గజేల్లి లక్ష్మి అనే వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లిన కేసులో ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు కోరుట్ల సీఐ సురేశ్ బాబు గురువారం తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మౌనిక, రాయికల్‌లో నివాసం ఉంటున్న రాజేశ్వరి ఈ దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారిని అరెస్టు చేశారు.
News February 14, 2025
దుబాయ్‌లో సిరిసిల్ల యువకుడు MISSING

దుబాయ్ దేశంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన జెల్లబాల శంకర్(30) ఈనెల 6వ తారీఖున బ్రతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మరుసటి రోజు సోనాపూర్ క్యాంపు నుంచి బయటకు వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. తోటి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.
News February 14, 2025
NZB: ఇంటర్‌నేషనల్ కాన్ఫరెన్స్‌కు టీయూ P.D

హైదరాబాద్ వేదికగా ఈ నెల 15 నుండి 16 వరకు జరగనున్న ‘ఇంటర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ 2025’లో తెలంగాణ యునివర్సిటీ వ్యాయామ విద్యలో సహాయ ఆచార్యులు(సి)గా పని చేస్తున్న డాక్టర్.బి.ఆర్.నేతకు చోటు లభించింది. ఇందుకు ఆయన టీయూ వైస్ ఛాన్సలర్ ప్రో.టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రో.యాదగిరిరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా నేతకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.