News January 30, 2025
ములుగు: చలిమంటల్లో పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

చలి మంటల్లో పడి విద్యార్థి కాళ్లకు తీవ్ర గాయాలైన ఘటన ఏటూరునాగారం మండలం మల్యాల ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి జరిగింది. 3వ తరగతి చదువుతున్న భూదేశ్ అనే గుత్తికోయ విద్యార్థి చలి వేస్తుందని పాఠశాల ఆవరణలో చలిమంటల కోసం ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో అదుపుతప్పి భూదేశ్ మంటల్లో పడగా 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 17, 2025
సూర్యాపేట: రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు

రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు ఒక గంట ముందు తమ కార్యాలయం నుంచి వెళ్లాడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి రెండో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల ప్రకారం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు విధుల నుంచి గంట ముందు వెళ్లే అనుమతి ఉంటుంది. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం ఉద్యోగుల వెసులుబాటు కోసం ఈ ఉత్తర్వులు అమలు చేస్తున్నారు.
News February 17, 2025
ఎల్లారెడ్డిపేట: ఉరి వేసుకుని వ్యక్తి మృతి

ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం బోప్పపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనుమ కనకయ్య ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 17, 2025
సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ: స్వామి

AP: గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని A, B, C కేటగిరీలుగా హేతుబద్ధీకరిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియలో కొందరిని తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మహిళా పోలీసుల విషయంలో శిశు సంక్షేమ, హోంశాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు.