News July 29, 2024
ములుగు: జలపాతాల వద్దకు వెళితే కఠిన చర్యలు

ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల, గుండం జలపాతాలతో పాటు ఇతర జలపాతాలకు అధికారికంగా ఎలాంటి అనుమతి లేదని ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి తెలిపారు. అనుమతి లేకుండా దొంగచాటుగా స్థానిక గ్రామస్థుల సహాయంతో పర్యాటకులు సందర్శనకు వెళుతున్నారన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని, అలా చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాలు జరిగి, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
Similar News
News November 30, 2025
బొబ్బరోనిపల్లి: 20 ఏళ్లుగా ఒకే కుటుంబం..!

దుగ్గొండి మండలం బొబ్బరోనిపల్లిలో సర్పంచ్ పదవి 20 ఏళ్లుగా ఒకే కుటుంబం చేతిలోనే కొనసాగుతోంది. 1994లో పంచాయతీ ఏర్పడిన తర్వాత 1995, 2013లో శంకేసి పద్మ, శంకేసి శోభ కమలాకర్ ఏకగ్రీవంగా గెలిచారు. 2001లో పద్మ భర్త నర్సింహాస్వామి, 2019లో కమలాకర్ విజయం సాధించారు. ఈసారి సర్పంచ్ పదవి జనరల్‌కు రావడంతో శోభ భర్త కమలాకర్ మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా, ఫలితంపై గ్రామంలో ఆసక్తి పెరిగింది.
News November 30, 2025
WGL: ఖర్చు ఎంతైనా పర్వా నై.. ఇక బుజ్జగింపుల పర్వం..!

WGL జిల్లాలో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్‌కు 656 మంది, వార్డు మెంబర్‌కు 1858 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేటి నుంచి పార్టీల్లో బుజ్జగింపుల పర్వం ప్రారంభం కానుంది. తమ పార్టీలకు చెందిన రెబల్స్‌తో పాటు స్వతంత్రుల నామినేషన్లను వెనక్కి తీసుకునేలా నేతలు ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు. పదవుల కోసం రూ.లక్షలు ఖర్చుపెట్టి రంగంలోకి దిగిన కొందరు వెనకడుగు వేయకపోవడంతో హీట్ పెరగనుంది.
News November 30, 2025
వరంగల్ కలెక్టరేట్ హెల్ప్‌డెస్క్‌కు 5 ఫిర్యాదులు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌కు 5 ఫిర్యాదులు వచ్చాయి. మూడు ఓటర్ ఐడీ సమస్యలుగా ఉండగా, వెంటనే సంబంధిత తహశీల్దార్లకు పంపించారు. మరో రెండు ఫిర్యాదులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులవి. ఉద్యోగంలో ఉండి ఎన్నికల్లో పోటీ చేయలేరని, ముందుగా రాజీనామా తప్పనిసరి అని హెల్ప్‌డెస్క్ స్పష్టం చేసింది. నియమావళి, ఓటింగ్, అభ్యర్థిత్వంపై సందేహాలకు హెల్ప్‌డెస్క్ ప్రజలకు తెలపనుంది.


