News March 10, 2025
ములుగు జిల్లాకు రూ.200 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలోని ములుగు నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 28, 2025
‘భారత్’ అనే శబ్దానికి అర్థమిదే..

‘భా’ అంటే జ్ఞానం. ‘ర’ అంటే ఆనందించడం. ‘త’ అంటే తరింపజేయడం. జ్ఞాన మార్గంలో ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా తరింపజేసేవాడే భారతీయుడు అని దీనర్థం. అందుకే ఇది కర్మభూమిగానూ ప్రసిద్ధి చెందింది. అంటే.. ఇక్కడ మన కర్మల ద్వారా మోక్షాన్ని, ముక్తిని సాధించుకోవచ్చని అంటారు. భారతదేశం ఆత్మజ్ఞానాన్ని, తత్వ వివేకాన్ని పొందేందుకు, జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అత్యంత అనువైన, పవిత్రమైన దేశంగా పరిగణిస్తారు. <<-se>>#Sanathana<<>>
News October 28, 2025
KNR: ఖాళీగా ‘విప్’ పోస్ట్.. రేసులో MLAలు..!

ప్రభుత్వ విప్గా ఉన్న అడ్లూరికి మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. విప్ కోసం MLAలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కవ్వంపల్లికి చోటు ఉంటుందని భరోసా ఇచ్చిన అధిష్ఠానం చివరి నిమిషంలో ఆయనకు షాక్ ఇచ్చింది. అప్పట్నుంచి నిరాశగా ఉన్న MLA కవ్వంపల్లికి విప్ పదవి ఇచ్చేందుకు పెద్దలు సిద్ధంగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది.
News October 28, 2025
లింబాద్రిగుట్ట: సంతానం కోసం గరుడ ముద్ద ప్రసాదం

భీమ్గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 29న ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. సంతానం కోరుకునే భక్తులు గరుడముద్ద ప్రసాదం కోసం ఆ రోజున ఉపవాసంతో విచ్చేయాలని ఆయన సూచించారు. తిరిగి నవంబర్ 6న భక్తులు కొండపైకి చేరుకుని, నవంబర్ 7న పోలు దారం వేసుకోవాలని పేర్కొన్నారు.


