News March 10, 2025
ములుగు జిల్లాకు రూ.200 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలోని ములుగు నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 23, 2026
యూనస్ ఫాసిస్ట్, దేశద్రోహి: షేక్ హసీనా

BANలో యూనస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఆ దేశ మాజీ PM షేక్ హసీనా అన్నారు. ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియాలో ఆమె ఆడియో మెసేజ్‌ను నిర్వాహకులు ప్లే చేశారు. యూనస్‌ను ఫాసిస్ట్, దేశద్రోహిగా, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విదేశాలకు సేవ చేసే కీలు బొమ్మగా ఆమె అభివర్ణించారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన హింసాత్మక ఘటనలపై UNతో ఇన్వెస్టిగేషన్ చేయించాలన్నారు.
News January 23, 2026
తిరుపతి: మూడో రోజు 35 మంది గైర్హాజరు

తిరుపతి జిల్లాలో JEE మెయిన్స్ పరీక్షలు మూడో రోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తిరుపతి సిటీ కోఆర్డినేటర్ టి.కైలాష్ నాథ్ మాట్లాడుతూ.. మొత్తం 2,111 మందికి గాను 2,076 మంది అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. 35 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్ష ముగిసింది.
News January 23, 2026
పీఎం శ్రీ పనులు సకాలంలో పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

జగిత్యాల జిల్లాలో పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన 20 పాఠశాలల్లో మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత హెచ్ఎంలను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిధులను నాణ్యతతో ఖర్చు చేసి పనులు వేగంగా పూర్తి చేస్తే తదుపరి విడత నిధులు వచ్చే అవకాశముందని తెలిపారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పనులను గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.


