News March 22, 2025
ములుగు జిల్లాకే తల మాణికం రామప్ప చెరువు!

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలో గల కాకతీయుల కాలం నాటి రామప్ప సరస్సు జిల్లాకే తలమానికం అని చెప్పవచ్చు. సుమారు 6000 ఎకరాల్లో పంటలకు సాగునీరు నందిస్తూ, నాలుగు మండలాలకు తాగునీరును అందించడమే కాక ఈ సరస్సులోని నీటిని గణపసముద్రం, పాకాల సరస్సులకు తరలిస్తున్నారు. రామప్ప సరస్సును రిజర్వాయర్‌గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నది. (నేడు ప్రపంచ జల దినోత్సవం)
Similar News
News July 9, 2025
23న సిద్దిపేట జిల్లాలో గవర్నర్ పర్యటన

సిద్దిపేట జిల్లా కోహెడలో ఈ నెల 23న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హైమావతి మంగళవారం హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని పరిశీలించారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 282 మహిళా సంఘాలకు గవర్నర్ చేతుల మీదుగా స్టీల్ సామాగ్రి (స్టీల్ బ్యాంకు) పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News July 9, 2025
ఆదిలాబాద్: స్థానిక ఎన్నికలు.. ఆశావహుల్లో TENSION..!

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలఖరులోగా వస్తుందనే ప్రచారంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆశావహులు పావులు కదుపుతున్నారు. మరోవైపు రిజర్వేషన్ ఖరారు కాకపోవడంతో పోటీ చేయాలని అనుకునే వారిలో టెన్షన్ మొదలైంది. కొంతమంది మండల పరిషత్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. కాగా, గ్రామపంచాయతీల డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ శ్రీజన మంగళవారం కలెక్టర్లకు అదేశాలిచ్చారు.
News July 9, 2025
నెల్లూరు రొట్టెల పండగకు 10 లక్షల మంది భక్తులు హాజరు

నెల్లూరు రొట్టెల పండుగకు ఇప్పటివరకు 10 లక్షల మంది భక్తులు హాజరైనట్లు జిల్లా అధికారులు అంచనా వేశారు. మంగళవారం ఒక రోజే 4 లక్షల మందికి పైగా దర్గాను దర్శించుకున్నట్లు తెలిపారు. ఎండ బాగా ఉన్నప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.