News December 13, 2024
ములుగు జిల్లాలోనే పెద్దపులి సంచారం!
ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి బుధవారం పెద్దపులి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం తాడ్వాయి మండలం పంబాపూర్ సమీప అడవుల్లో పెద్దపులి పాదముద్రల గుర్తించామని రేంజర్ కోట సత్తయ్య తెలిపారు. ఓ వాగు వద్ద సంచరించినట్లు తెలిపారు. ఆ తర్వాత పాదముద్రలు కనపడలేదన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News January 21, 2025
పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి: ఏసీపీ దేవేందర్ రెడ్డి
పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. హనుమకొండ డివిజన్ పోలీస్ అధికారులతో ఏసీపీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చోరీలను కట్టడి చేయడం కోసం పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని స్టేషన్ అధికారులకు సూచించారు.
News January 21, 2025
గ్రామ సభలో పాల్గొన్న వరంగల్ పోలీస్ కమిషనర్
నేటి నుంచి ప్రారంభమైన గ్రామ సభల కార్యక్రమంలో భాగంగా నగరంలోని డివిజన్ల పరిధిలో నిర్వహిస్తున్న గ్రామ సభలకు వరంగల్ పోలీస్ కమిషనర్ హాజరువుతున్నారు. ఇందులో భాగంగా 22వ డివిజన్లో నిర్వహించిన గ్రామ సభకు పోలీస్ కమిషనర్ పాల్గొని పోలీస్ బందోబస్తుతో పాటు సభ ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సభలకు స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, వరంగల్ ఏసీపీ నందిరాం మట్టేవాడ ఇన్‌స్పెక్టర్ పాల్గొన్నారు.
News January 21, 2025
దీప్తి జీవాంజిని వరించిన మరో అవార్డు
ఇటీవల అర్జున అవార్డు అందుకున్న ఓరుగల్లు బిడ్డ దీప్తి మరో అవార్డుకు ఎంపికైంది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు అందించే తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అవార్డుకు దీప్తి ఎంపికైనట్లు సోమవారం ప్రకటించారు. ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ ఈనెల 26న ప్రదానం చేయనున్నారు. అవార్డులో భాగంగా రూ.2లక్షల నగదు, జ్ఞాపిక అందజేస్తారు. కాగా, దీప్తి పర్వతగిరి మండలం కల్లెడవాసి.