News December 19, 2024

ములుగు జిల్లాలోనే 9 రోజులుగా పెద్ద పులి!

image

ములుగు జిల్లాలో 9 రోజులుగా పెద్ద పులి సంచరించడం సంచలనంగా మారింది. వెంకటాపురం మండలం ఆలుబాక, బోధపురం గోదావరి సమీపంలో ఈ నెల 10న పెద్దపులి పాదముద్రలు కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మంగపేట, తాడ్వాయి సమీప అడవుల్లో సంచారం కొనసాగిస్తుంది. పులి అడుగుజాడలు ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులు గుర్తిస్తున్నారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Similar News

News January 17, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులు బ్యాలెట్ పేపర్ల ముద్రణపై కసరత్తు చేస్తున్నారు. ఎప్పటి లాగే సర్పంచులకు గులాబీ బ్యాలెట్, వార్డ్ మెంబర్లకు తెలుపు బ్యాలెట్ ఉపయోగించనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 1,806 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

News January 17, 2025

వరంగల్: శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

పోటీ పరీక్షలు ప్రిపేరయ్యే మైనారిటీ అభ్యర్థులకు బేసిక్ ఫౌండేషన్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రమేష్ తెలిపారు. రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 4 నెలల పాటు HYDలో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు సరైన ధ్రువపత్రాలతో వచ్చే నెల 15 వరకు కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News January 16, 2025

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాలు తరలివచ్చాయి. పచ్చి పల్లికాయ క్వింటా ధర రూ.4300 పలకగా.. సూక పల్లికాయ ధర రూ.6210 పలికింది. అలాగే కందులు క్వింటాకు రూ.7003, బబ్బెర్లు రూ.7100, నల్లనువ్వులు రూ.11,500 పలికినట్లు రైతన్నలు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.