News October 1, 2024

ములుగు జిల్లాలో ఆకాశంలో అద్భుత దృశ్యం

image

ములుగు జిల్లాలో ఆకాశంలో వింత ఘటన చోటు చేసుకుంది. సోమవారం వెంకటాపురంలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం మేఘాలలో మార్పు రావడంతో మేఘం వింతగా కనిపించింది. ఈ దృశ్యాన్ని పలువురు ఫోనులో బంధించారు. ఇలా మేఘంలో మార్పు రావడానికి దేనికైనా సంకేతమా..? లేక మామూలుగా జరిగిందన్న విషయంపై మండలంలో తీవ్రంగా చర్చ జరుగుతుంది.

Similar News

News November 25, 2024

MHBD: మొదటి జీతం అందుకోకుండానే టీచర్ మృతి

image

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల సాకారం చేసుకొని మొదటి జీతం అందుకోకుండానే రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడిని మృత్యువు కబళించింది. MHBD జిల్లా గంగారం మండలం బావురుగొండ టీచర్ ఉపేందర్ (45) పాఠశాలకు వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని మృతి చెందారు. బయ్యారం మండలానికి చెందిన ఉపేందర్ ఇటీవల ఎస్జీటీ ఉద్యోగం సాధించారు. ఉపేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News November 25, 2024

నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్

image

నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్ రానున్నారు. లగచర్ల ఘటనను నిరసిస్తూ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి మహాధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. కాగా, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొననున్నారు.

News November 25, 2024

వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన వరంగల్ కలెక్టర్ సత్య శారద

image

గీసుగొండ మండల కేంద్రంలో వరంగల్ కలెక్టర్ సత్య శారద జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి రైతులు పండిస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా వివిధ రకాల పంటలను పండిస్తే నేలలు బాగుపడటమే కాకుండా అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. రైతులు కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హరిబాబు, స్థానిక రైతులు పాల్గొన్నారు.