News January 29, 2025
ములుగు జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమలు

ఉమ్మడి వరంగల్- నల్గొండ- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో నేటి మధ్యాహ్నం నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, క్యాలెండర్లు, బోర్డులు, హోర్డింగులను తొలగించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
Similar News
News December 4, 2025
MHBD: డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

MHBD జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడంలో అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ఎవరైనా మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం చేస్తే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని కళాశాలల్లో పోలీసుశాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రైల్వే, బస్ స్టేషన్లలో నిఘాపెంచాలన్నారు.
News December 4, 2025
SKLM: ‘ఆలయాల్లో దొంగతనాలు చేసిన ముగ్గురి అరెస్ట్’

జిల్లాలో పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,71,000 స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద గురువారం వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ఈ ముగ్గురూ గతంలో ఆముదాలవలసలో మోటార్ బైకుల దొంగతనం కేసులో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు కూడా డీఎస్పీ వెల్లడించారు.
News December 4, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి(D) చిట్టమూరులో 88.5mm, చింతవరంలో 81mm, నెల్లూరులో 61mm, పాలూరులో 60mm వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.


