News March 1, 2025
ములుగు జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

ములుగు జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఓరుగల్లు వాసులు భయపడుతున్నారు. ఈరోజు వరంగల్ నగరంలో 33 నుంచి 37 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 36 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News November 28, 2025
అమ్మకానికి రెండు IPL జట్లు: హర్ష్ గోయెంకా

ఒకటి కాదు రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ‘ఆర్సీబీ మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా అమ్మకానికి వస్తుందని నేను విన్నాను. వీటిని కొనుగోలు చేసేందుకు నలుగురు.. ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, USA ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2025
సిద్దిపేట: ఒకే మండలం నుంచి నలుగురు ఏకగ్రీవం

సిద్దిపేట జిల్లాలో నలుగురు సర్పంచ్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగదేవపూర్ మం. బీజీ వెంకటాపూర్లో పరమేశ్వర్, మాందాపూర్లో ముత్యం, పలుగుగడ్డ నర్ర కనకయ్య, అనంతసాగర్లో కుమార్ను గ్రామాల అభివృద్ధి దృష్ట్యా గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నలుగురు బీసీ రిజర్వేషన్ కింద కేటాయించిన అభ్యర్థులే కావటం విశేషం. అయితే వారంతా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సర్పంచులవటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
News November 28, 2025
మచిలీపట్నం: మళ్లీ సేమ్ సీన్ రిపీట్..?

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావొస్తుంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి రవీంద్ర కలిసి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయలేదు. ఒకట్రెండు సార్లు ప్రెస్మీట్లలో కలిసి పాల్గొన్నారు. ఇద్దరు నేతల మధ్య సమన్వయ లోపంతో ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా గతంలోనూ మాజీ మంత్రి పేర్నినాని, ఎంపీ బాలశౌరికి అంతర్గత విభేదాలతో ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం.


