News March 11, 2025

ములుగు జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

image

ములుగు జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 35 నుంచి 38 డిగ్రీలు, రేపు కూడా అవే ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.

Similar News

News December 4, 2025

కొత్త ఏడాదిలోనే మార్కాపురం జిల్లా..!

image

నూతన సంవత్సరం వస్తూ వస్తూ.. మార్కాపురం డివిజన్ ప్రజల కలను నెరవేరుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు జిల్లా ప్రకటనకు పచ్చజెండా ఊపారు. అయితే ఈనెల 30 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు గడువు ఉంది. దీనిని బట్టి 2026 రావడంతోనే, కొత్త జిల్లా అధికారిక ప్రకటన రానుంది. 2026 జనవరి 1 రోజే అధికారిక ఉత్తర్వులు రావచ్చని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద కొత్త ఏడాది కొత్త కబుర్లు తీసుకురానుందని ప్రజలు అంటున్నారు.

News December 4, 2025

రవాణా విస్తరణ-భద్రతపై పటిష్ఠ చర్యలు తీసుకోవాలి: ఎంపీ

image

రాష్ట్రంలో రవాణా వ్యవస్థ విస్తరణ, రోడ్లకు నిధుల కేటాయింపు, జాతీయ రహదారులపై పెరుగుతున్న ప్రమాదాల నియంత్రణ అంశాలపై పార్లమెంటులో ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. తెలంగాణలో రవాణా విస్తరణ-రోడ్డు భద్రతపై కేంద్రం పటిష్ఠ చర్యలు చేపట్టాలని, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు.

News December 4, 2025

పెండింగ్ చలాన్లు మొత్తం కట్టాల్సిందే: వరంగల్ సీపీ

image

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. వాహనదారులు తమ వాహనంపై ఉన్న ట్రాఫిక్ జరిమానాలు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. పెండింగ్ ట్రాఫిక్ జరిమానాలపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి రాయితీ ప్రకటించలేదని వాహనదారులకు సూచించారు.