News March 11, 2025
ములుగు జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

ములుగు జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 35 నుంచి 38 డిగ్రీలు, రేపు కూడా అవే ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.
Similar News
News March 21, 2025
కృష్ణా: ‘రెడ్ బుక్‌తో ఏం చేయలేరు’

వైసీపీ నేతల అరెస్ట్‌లతో జగన్ పరపతి ఎక్కడా తగ్గదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఏం చేయలేరని, 6 గ్యారంటీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోసానిపై 18 కేసులు పెట్టేందుకు ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు.
News March 21, 2025
ప్యాపిలి: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

ప్యాపిలి మండలం ఏనుగుమర్రి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ప్యాపిలి సీఐ వెంకటరామిరెడ్డి శుక్రవారం వెల్లడించారు. పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బొజ్జన్న బాలికలను లైంగికంగా వేధించాడని, విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
News March 21, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤మినీ గోకులాలను పూర్తి చేస్తాం: జిల్లా కలెక్టర్➤ నంద్యాల: ఫరూక్ సతీమణి చివరి కోరిక.. HYDలోనే అంత్యక్రియలు➤ ఉమ్మడి జిల్లా ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13కు వాయిదా➤ మంత్రి ఫరూక్ సతీమణి మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం➤ కర్నూలులో TDP నేత దారుణ హత్య.. ఎస్పీ వివరాల వెల్లడి ➤ కర్నూలులో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు➤ మంత్రాలయం: పల్లెల్లో దాహం కేకలు..!➤ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి