News February 27, 2026
ములుగు జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ 58.55%

జిల్లాలో రైతుల ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు పురోగతి మందకొడిగా ఉంది. జిల్లాలో మొత్తం 82,205 పట్టాదారుల్లో 48,129 మంది నమోదు చేసుకొని 58.55 శాతం మాత్రమే పూర్తి చేశారు. గడువు ఈ నెల 28తో ముగియనుండటంతో మిగిలిన రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ యూనిక్ ఐడీ లేకుండా భవిష్యత్తులో కేంద్ర వ్యవసాయ పథకాలు పొందడం కష్టమవుతుందని తెలిపారు. మీసేవ కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News April 14, 2026
రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నిజామాబాద్ జిల్లాలోనే..!

రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నిజామాబాద్ జిల్లా మాచర్లలో 43.2°C ల నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా పూర్తిగా ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. జిల్లాలో అన్ని వెదర్ స్టేషన్లలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎండలు తీవ్రం కావడంతో ఉక్కపోత భరించలేక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వడగాలులు సైతం వీయడంతో తప్పనిసరి జాగ్రతలు వహించాలన్నారు.
News April 14, 2026
సంగారెడ్డి: జీవితం అంటే ఓటమి కాదు.. మరో అవకాశం..!

విద్యార్థులారా..! కాగితం మీద పడ్డ ‘ఫెయిల్’ ముద్ర, నీ నుదుటి రాతను మార్చలేదు. పదో తరగతిలో తడబడిన సచిన్, ప్రపంచం కొలిచే శిఖరమయ్యాడు.. నువ్వు విసిరేసిన ప్రాణం, నీ కన్నవారికి తీరని శోకమవుతుంది. ఓటమి అనేది ముగింపు కాదు.. నిన్ను నువ్వు దిద్దుకునే ఒక మలుపు..!. ఇంటర్ రిజల్ట్స్ తర్వాత సంగారెడ్డి జిల్లా మనూరు, నాగలిగిద్ద, సిద్దిపేట జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఉమ్మడి జిల్లాను కలవరపెట్టాయి. ఇలా చేయకండి.
News April 14, 2026
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మండిపోతున్న ఎండలు!

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో సోమవారం ఎండలు మండిపోయాయి. రెంటచింతలలో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ఠ, 27 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నరసరావుపేటలో 42, గుంటూరులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెనాలిలో 38 డిగ్రీలు నమోదు కాగా, బాపట్ల, చీరాలలో 36 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


