News February 13, 2025
ములుగు జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!

ములుగు జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి.. క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యామ్లు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్ర ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News November 1, 2025
చూపులేని అభ్యర్థుల కోసం స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్

దృష్టిలోపం ఉన్న అభ్యర్థుల కోసం పరీక్షల్లో ‘స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్’ ఉపయోగించాలని UPSC నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సాఫ్ట్వేర్ ఏర్పాటు అంశాలను పరిశీలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తి చేసింది. చూపులేని వారికి UPSC సమాన అవకాశాలు కల్పించడం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టులో పిల్ దాఖలవడంతో కమిషన్ చర్యలు చేపట్టింది.
News November 1, 2025
పేపర్, TV ద్వారా శవరాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు: CBN

AP: YCP ఓ ఫేక్ పార్టీ అని CBN విమర్శించారు. ‘ఆ పార్టీకి ఏం దొరకడం లేదు. ఏ ప్రమాదం జరిగినా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపైనా దుష్ప్రచారం చేశారు. YCPకి ఓ పాంప్లెట్, ఛానెల్ ఉన్నాయి. వాటితో శవరాజకీయం చేస్తోంది. కమ్మ, కాపు మధ్య విద్వేషాలు రగిలించేందుకు యత్నిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. వీటిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉండే అర్హత వారికి లేదన్నారు.
News November 1, 2025
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం తెలిపారు. జిల్లాలో కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉండి క్రిములు వృద్ధ చెందుతాయన్నారు. వీటి వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలు తమ చుట్టు ప్రక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతినిత్యం చేతులను సబ్బుతో కడుక్కోవాలన్నారు. నీటిని వేడి చేసి తాగాలన్నారు.


