News April 13, 2025
ములుగు జిల్లాలో మళ్లీ పులి సంచారం..!

తాడ్వాయి, ఏటూరునాగారం సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏటూరునాగారం, పస్రా అటవీ శాఖ రేంజ్ అధికారులు హెచ్చరించారు. ఏటూరునాగారం వన్యప్రాణి డివిజన్ పరిధిలోని అడవిలో పులి సంచరిస్తున్న సమాచారం మేరకు వాటి అడుగుజాడల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. మహదేవపూర్, మేడారం సరిహద్దుల్లో ఓ పశువును పులి చంపిందన్న సమాచారం మేరకు బయ్యక్కపేట, ఐలాపూర్ ప్రాంతాల్లో పులి కదలికలపై ఆరాతీస్తున్నామన్నారు.
Similar News
News February 26, 2026
కన్నులపండువగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తొలిరోజు స్వామి పుష్కరిణిలో తెప్పపై మూడు సార్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
News February 26, 2026
జింబాబ్వేపై భారత్ విధ్వంసం.. స్కోర్ ఎంతంటే?

T20WC: చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు చెలరేగారు. దీంతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్(55) హాఫ్ సెంచరీ చేశారు. ఇషాన్(38), సంజూ(24), సూర్య(33) రాణించారు. చివర్లో హార్దిక్(23 బంతుల్లో 50*), తిలక్(16 బంతుల్లో 44*) మెరుపులు మెరిపించారు. జింబాబ్వే టార్గెట్ 257 రన్స్.
News February 26, 2026
MBNR: రాజ్ కోట్ – మహబూబ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్ల పొడిగింపు.!

ఉమ్మడి జిల్లా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజ్కోట్ – మహబూబ్ నగర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సేవలను రైల్వే శాఖ మార్చి 2026 వరకు పొడిగించింది. రైలు నం.09575 (రాజ్కోట్-మహబూబ్ నగర్) ప్రతి సోమవారం, రైలు నం.09576 (మహబూబ్ నగర్-రాజ్కోట్) ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి. మార్చి నెలలో ఎంపిక చేసిన తేదీల్లో ఈ సర్వీసులు నడుస్తాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.


